ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు పేర్లు నమోదు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారన్నారు.