కరీంనగర్లో రెండున్నర ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. గత నెల అక్టోబర్ 27న షైక్ రేనా అనే మహిళ తన బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలిని చేరదీసిన దాసరి స్వరూప, మధ్యవర్తి మోతె కృష్ణ అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు విచారణలో గుర్తించారు. రూ.50 వేలకు కరీంనగర్ లోని సవరన్ స్ట్రీట్ కు చెందిన దంపతులకు వారు విక్రయించినట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.