25 రోజుల పసిబిడ్డను.. రూ.30 వేలకు అమ్మిన తండ్రి

61பார்த்தது
25 రోజుల పసిబిడ్డను.. రూ.30 వేలకు అమ్మిన తండ్రి
అస్సాంలోని ధేమాజీ జిల్లాలో ఇటీవల హృదయ విదారక ఘటన జరిగింది. అక్టోబర్ 4న దిబ్రూగఢ్‌లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తల్లిదండ్రులు ధిమాన్ బోరా, సబితా బోరా ఆడ పిల్లను భారంగా భావించి రూ. 30,000కు వేరే వాళ్లకు అమ్మేశారు. ఈ విషయం చైల్డ్‌ వెల్ఫేర్ కమిటీ తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி