కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రవణ్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.