వేములపల్లి మండలం బుగ్గ బావి గూడెం సమీపంలో జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం భూమిని చదును చేస్తుండగా యాదవ నేతలు జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సోమవారం జిల్లా ఎస్పీ అపూర్వరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వేములపల్లి మండల జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు పోతురాజు నాగయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై సామాన్యమైన వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.