శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామరక్ష కార్యాలయం నందు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముడుంబై రఘువరన్ ఆచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని గౌరవ సలహాదారులు రెంటాల సతీష్ శర్మ ఆవిష్కరించి తదుపరి అందరు జాతీయగీతం అలాపన చేశారు.