పిఆర్టియు కోదాడ మండల శాఖ ఆధ్వర్యంలో అడ్లూరు కాలనీకి చెందిన డీఎస్సీ 2024 ఉపాధ్యాయుల నుండి ప్రాన్ అప్లికేషన్లు స్వీకరించారు. అనంతరం వారికి సర్వీస్ బుక్స్ బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పిఆర్టియు సంఘం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిడమర్తి అంకులయ్య, రవీందర్ రెడ్డి, హెచ్ఎం సత్య నారాయణ ఉన్నారు.