కోదాడ, హుజూర్ నగర్, పాలేరు నియోజకవర్గాలలో ఉన్న డీజే యజమానులు కోదాడలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంతు లింగస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేణు, ఓం శీను ఉపాధ్యక్షులు వజీర్, కోశాధికారి తులస, కార్యదర్శి పండు, సిద్దు, జానీ, నరేష్ పాల్గొన్నారు.