రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్ తో పాటు రేపు సద్దుల బతుకమ్మ నేపథ్యంలో తీరొక్క పుష్పాలు కొనేందుకు రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. పలు ఆటోలు, వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు ట్రాఫిక్ ను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.