ఎమ్మెల్యేనని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం మేడిపల్లి మండలంలోని మోత్కురావుపేట నుండి చందుర్తి వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని తుల ఉమ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ తాను కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ హయాంలో ఉన్నప్పుడు 19. 75 కోట్ల తో నిధులు మంజూరు చేయించానని కాని ఇన్నాళ్లు గడిచిన పనులు పూర్తి కాలేవని తెలిపారు.
ప్రజలు మేడిపల్లి నుండి వేములవాడ కు వెళ్ళాలంటే ఇటు జగిత్యాల నుండి లేదా అటు కోరుట్ల నుండి రెండు గంటలు తిరిగి వెళ్ళాలని తెలిపారు. ఎమ్మెల్యేనంటూ ఇది చేస్తానని, అది చేస్తానంటూ చెప్పుకుంటూ జర్మనీకి వెళ్ళి కుటుంబ సభ్యులతో గడపడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని తుల ఉమ అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.