నూతనంగా ఏర్పడిన భీమారం మండలంలో మొదటి సారిగా వచ్చిన తహశీల్దార్ ను ముదిరాజ్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. మండల కేంద్రంలో శుక్రవారం నూతన తహశీల్దార్ యూసఫ్ ను భీమారం ముదిరాజ్ సంఘ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిటీసి పల్లి అర్జున్ తహశీల్దార్ కు స్వీట్ అందించారు. అర్జున్ మాట్లాడుతూ భీమారం కొత్త మండలం ఏర్పడిన తర్వాత వచ్చిన తహశీల్దార్ కు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, మండలం లోని ప్రజలందరూ అధికారులకు అనుగుణంగా ఉంటారని, ఎలాంటి సమస్య పరిష్కారం అయినా త్వరితగతిన పూర్తి చేయగలరని యూసుఫ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ, ఎంపిటిసి అర్జున్, ముదిరాజ్ సంఘ పెద్దలు ఒలవేణి సురేష్, బోయిని నరేష్, గంగాధర్, నర్సయ్య, కొండయ్య, తిరుపతి, ధర్మేందర్, భీమయ్య, శ్రీనివాస్, రమేష్ మరియు చెక్కపెల్లి రఘు, రవి, రాజు ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.