రామగుండం ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అని ఆధ్యాత్మికత ప్రజలకు రాజ మార్గం అని స్థానిక ఎమ్మెల్యే చందరు అన్నారు. గోదావరిఖని పట్టణంలోని జయ దుర్గ దేవి అమ్మవారి ఆలయంలో గత మూడు రోజుల నుండి నిర్వహించిన చండీ యాగం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన చికిత్స ఉచితంగా అందించేందుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు తాను సం కల్పించడం జరిగిందని, సకల దేవతలు అమ్మవారి దయతో ఆ సంకల్పం నెరవేరి నందున చండీ యాగం నిర్వహించామని తెలిపారు.
ఈ ప్రాంత రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తనకు మద్దతుగా పలుమార్లు కెసిఆర్ కి కళాశాల ఆవశ్యకతను వివరించారని సకల దేవతలు అమ్మ వారి ఆశీస్సులతో తన సంకల్పం నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ ఫౌండేషన్ అధ్యక్షులు కోరు కంటి మణిదీప్, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ , డిప్యూటీ మేయర్ అభిషేక రావు , పలువురు కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.