పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా డి. వేణు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీలలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న వేణును పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ కోయ శ్రీ హర్షను అదనపు కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.