అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం మంథని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మంథని అభివృద్ధి పనులకు భూ కేటాయింపులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ హనుమా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, ఈఈ ఆర్ & బీ భావ్ సింగ్ పాల్గొన్నారు.