ముత్తారం మండల కేంద్రంతో పాటు పారుపల్లి గ్రామంలో బుధవారం అదనపు కలెక్టర్ వేణు సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహశీల్దార్ కార్యాలయం సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ సుమన్, డిప్యూటి తహశీల్దార్ షఫీ, ఆర్ఐ శ్రీధర్, సీనియర్ సహాయకులు భవానీ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.