పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ప్రకటనలో తెలిపారు. సన్నరకం ధాన్యం ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నామని, ప్రతి క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని, ఈనెల 14 నుంచి 18 వరకు 1503 రైతుల నుంచి లక్ష 18 వేల 260 క్వింటాళ్ల సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి రూ. 5కోట్ల 91లక్షల 30వేల 600 బోనస్ చెల్లించామన్నారు.