జగిత్యాల: కుటుంబ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం మల్లాపూర్ ఎంపిడివో కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్వాడీ, ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిపివో రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.