జగిత్యాల జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ ఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) జాతీయ అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు నక్క గంగారం, జగిత్యాల టౌన్ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు నక్క రమేష్, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ సంగేపు ముత్తు పాల్గొన్నారు.