హరీష్ రావుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ హయాంలో జగిత్యాల అభివృద్ధి రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. బుధవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ రైతులకు వడ్డీల మాఫీకే సరిపోయిందన్నారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రక్షాళన అని పేర్కొన్నారు.