ఆరోగ్య విషయంలో ఫిట్ నెస్ కాపాడుకోవడం యువత కు చాలా ముఖ్యమైనది. మండల కేంద్రంలో స్థానిక పద్మశాలి సంఘం భవనంలో మ్యాకల కిశోర్ వ్యయామశాలను నిర్వహిస్తున్నారు. నేటికాలంలో వ్యాయామం చేయడం అనేది యువతకు గాని, నడివయసు వారు కాని అందరికీ ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో పిల్లలు గాని, విధ్యార్థులు గాని ఆటలు ఆడుతుండేవారు. కాని ఈ కాలంలో ప్రొద్దున లేచినప్పటినుండి పడుకునేవరకు చదువుతోపాటు, చాటింగులని, ఆన్లైన్ గేమ్స్ అని ఫోన్లలో లీనమవుతున్నారు. దీంతో ఆటపాటల విషయం దేవుడెరుగు సమయానికి తినడం, నిద్రపోవడం కూడా కరువైపోయింది. అంతేకాకుండా ఇప్పుడు మనం తినే ఆహారం కూడా జంక్ ఫుడ్ గా మారి చిన్న పిల్లల నుండే శరీరం ఊబకాయం గా తయారవుతుంది. దీనివల్ల చాలామందికి ముఫ్ఫైవయసు లోపే బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ వ్యాయమాలు లేక నడివయసు వచ్చేసరికి కొంతమంది మంచానపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యయామశాలలు పట్టణాల్లో ఉన్నాయి. ప్రస్తుత కాలనికి జరుగుతున్న పరిస్థితులను ఆలోచించిన మ్యాకల కిషోర్ అనే వ్యక్తి మేడిపల్లి మండల కేంద్రం లో అందరికీ అందుబాటులో ఉండేలా వ్యాయామశాలను నిర్వహిస్తున్నారు. ఈ సంధర్భంగా కిషోర్ మాట్లాడుతూ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా గాని, మానసికంగా గాని ఫిట్ నెస్ కాపాడుకోవడమే కాకుండా, మనో ఉల్లాసంగా ఉండగలుగుతారని తెలిపారు. పదహారు వయసు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామాలు చేసుకుంటూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన తెలిపారు.