కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ధర్మపురిలోని బ్రహ్మపుష్కరినిలో పంచసహస్ర దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుష్కరినీలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొదటి దీపాన్ని వెలిగించారు. అనంతరం గోదావరిలో నిర్వహించిన గంగా హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.