సిద్ధిపేట జిల్లా దూల్మిట్ట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33కేవీ ఫీడర్ లైన్ కింద ఉన్న చెట్లకొమ్మలు తొలగించే పనుల వల్ల సోమవారం మధ్యాహ్నం 12. 30ని. ల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.