బ్యాంకులో దోపిడీలు జరిగేటప్పుడు అలారమ్ మోగేలా చూసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని సేఫ్ అండ్ సెక్యూరిటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వివిద బ్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేస్తున్నాయా లేదానన్న విషయాన్ని ప్రతీ రోజు మానిటరింగ్ చేసుకోవాలన్నారు.