ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈ నెల 22న దుబ్బాక పట్టణానికి చేరుకోనుందని సోమవారం దుబ్బాక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కాల్వలింగం తెలిపారు. ప్రతి ఒక్క అంబేద్కర్ వారసులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇట్టి పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.