TG: వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మహిళా నాగసాధు అఘోరీ పర్యటిస్తున్నారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి నుంచి భద్రకాళి ఆలయం వరకు ఆమె పాదయాత్ర చేపట్టారు. అఘోరీ తన వాహనాన్ని నిరాకరించి వరంగల్ ఫ్లైఓవర్, బట్టల బజార్ మీదుగా భద్రకాళి టెంపుల్ కు పాదయాత్ర కొనసాగుతోంది. అఘోరీని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.