ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 42 మంది వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.