సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రిలోని రికార్డులు పరిశీలించి జిరాక్స్ కాపీలను తీసుకెళ్లినట్లు కమిటీ సభ్యురాలు డాక్టర్ పుష్పవాన్ని తెలిపారు. వీటిలో ఏమైనా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి పాల్గొన్నారు.