మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి అన్నారు. సోమవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్ష 50 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు, మార్కెటింగ్ సౌకర్యం అందిస్తోందని తెలిపారు.