రామచంద్రాపురం శ్రీనివాస నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద బుధవారం సాయంత్రం 5గంటలకు సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ పుష్ప నగేష్ తెలిపారు. వేడుకలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు ప్రైజ్ మనీ ఉంటుందన్నారు. మొదటి ప్రైజ్ మనీ రూ. 20వేలు, రెండవ ప్రైజ్ మనీ రూ. 15వేలు, మూడవ ప్రైజ్ మనీ రూ. 10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.