అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. నందిగామ మండల, మోత్కూల గూడ గ్రామ వాస్తవ్యులకు మంజూరైన చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.