హైదరాబాద్‌లో మరో భారీ మోసం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు.