Nov 09, 2024, 02:11 IST/
సన్నాల బోనస్ చెల్లింపు షురూ
Nov 09, 2024, 02:11 IST
సన్నాల సాగును ప్రోత్సహించేందుకు బోనస్‌గా క్వింటాకు రూ.500ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రైతులకు చెల్లింపులకు సిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లలో దొడ్డు వడ్లకు, సన్నాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటుచేశారు. క్వింటాకు రూ.500చొప్పున 48.91లక్షల టన్నులకు రూ.2,445కోట్ల బోనస్‌ను రైతులకు చెల్లించాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా రూ.వెయ్యి కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.