"కడ" అభివృద్ధికి నిధులు విడుదల
కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడ) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 43. 75 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో భాగంగా కడ అభివృద్ధి కోసం మొదటగా 120 కోట్ల రూపాయల అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కాగా వివిధ పనులు చేపట్టారు. రెండవ విడతగా 43. 75 కోట్ల రూపాయలను ప్రభుత్వము విడుదల చేసింది.