అధికారుల నిర్లక్ష్య సమాధానంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యవారిగూడెం, చౌదర్పల్లి గ్రామాల్లో మంగళవారం 40 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభో త్సవాలు చేశారు. చౌదర్ పల్లిలో వారం రోజులుగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో మిషన్ భగీరథ అధికారులను ఎమ్మెల్యే రంగారెడ్డి పిలిచి గ్రామానికి నీటి సరఫరా ఎందుకు కావడం లేదని మండిపడ్డారు.