ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. కొంగరా కలాన్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇతర శాఖలకు సంబంధించి 7 మొత్తం 50 దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అన్నారు.