మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుతో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయమన్నారు.