రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొంటారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇందులో ప్రసంగించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.