ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పులు.. స్టూడెంట్ సూసైడ్‌ (వీడియో)

1068பார்த்தது
AP: పల్నాడు జిల్లాలోని మాచ‌ర్ల‌లోని శనివారం షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ న్యూటన్ ఇంజినీరింగ్ కళాశాలలో భరత్ అనే విద్యార్థి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే భరత్ ఇటీవల ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన భరత్ పట్టణంలోని విష్ణుప్రియ లాడ్జి వెనుక భవనంలోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி