దీపావళి నాడు గణపతికి, శ్రీ లక్ష్మీ దేవికి కుంకుమ పువ్వును పాలలో వేసి నైవేద్యంగా పెడితే శుభం జరుగుతుంది. వీటితో పాటుగా తీపి పదార్థాలు కూడా సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన గులాబ్ జామ్, మోతీచూర్ లడ్డూ, కోవా, బర్ఫీ, కొబ్బరి, తాజా పండ్లు, తమలపాకులు, సీతాఫలం, అరటిపండ్లు, పూల్ మఖానా, శనగపిండి లడ్డూ అమ్మవారికి, వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి.