నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతు పంట అమ్మకాల సందర్భంగా ఏ దశలోను నష్టపోకుండా తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని అన్నారు.