విద్యార్ధులు తమ తల్లి తండ్రులు, గురువుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలనీ సోమవారం బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి అన్నారు. అమె బొదన్ పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల, సాయివిజేత మహిళ జూనియర్ కళాశాల అన్వెల్ డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్ధులు శ్రద్దగా చదువుతూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు.