నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో విజయదశమి వేడుకలు శనివారం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా రామున్ని వాగు గడ్డ నుండి హనుమాన్ మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రావణున్ని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బార్ల ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షులు నవనీత్, ప్రధాన కార్యదర్శి గంధం రాములు, జాన్, యూత్ సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.