షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన ఘటన మంగళవారం తానూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పవార్ వందన ఇంట్లో నుండి మంటలు చెలరేగటంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించడంతో స్థానికులు గ్యాస్ ఏజెన్సీ వారికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకున్న సిబ్బంది బయటకు తీసి మంటలు అర్పించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.