లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రంలో కొనుగోళ్లు జరపడం లేదని రైతులు గురువారం కుంటాల మండలం ఆర్లి X రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యం పోసి ఇప్పటికే 45 రోజులు పూర్తి కావస్తున్నా కొనుగోళ్లు జరపడం లేదని మండిపడ్డారు. పనులను వదులుకొని కళ్ళల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.