లక్ష్మీనారాయణ ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

165பார்த்தது
లక్ష్మీనారాయణ ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి, పంచోపనిషత్తులతో పూజించి పంచామృతాలతో అభిషేకించి, సహస్ర తులసి దళాలు అర్పించి ఫలాలను నివేదించడం జరిగింది. ఆలయ పూజారి నరసింహ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ పూజారి నరసింహ స్వామి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ దర్శనం శుభప్రదం. గురువారం నుండి దక్షిణ యానం మొదలవుతుంది. స్వామివారికి రాత్రి మొదలవుతుంది. ఉత్తరాయానం అనగా ఉదయం అని, దక్షిణ యానం అనగా రాత్రి అని, 24 ఏకాదశి లు స్వామి వారికి 24 గంటలతో సమానం. మనుషులకు సంవత్సరకాలం దేవతలందరికీ ఒక రోజుతో సమానం. తొలి ఏకాదశి రోజున స్వామివారు నిద్రలోకి వెళ్ళే రోజు కావున శయ ఏకాదశి కూడా అంటారు. పండుగలలో మొదటి పండుగ కావున తొలి ఏకాదశి అంటారు. గురువారం స్వామివారిని పూజించడం శుభప్రదం. స్వామివారిని దర్శించడం మోక్షప్రదం. 24 ఏకాదశిలలో మొదటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు చేసే పూజలు శుభ ఫలితాలను కలుగజేస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி