భైంసా పట్టణంలోని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డా. కాశీనాథ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రముఖ ఫిజీషియన్ డా. ముఖేష్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉందని, కావున ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తామని తెలిపారు.