భైంసాలోని బైల్బజార్ కాలనీకి చెందిన బంటోల్ల రాములు(38) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ గౌసోద్దిన్ వివరాల ప్రకారం పదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రాములు తలకు తీవ్ర గాయమైంది. దీంతో మతిభ్రమించింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నయం కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.