నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు జరగవని శుక్రవారం మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు రెండవ శనివారం, ఆదివారం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లకు విరామం ఇస్తున్నామని పేర్కొన్నారు. తిరిగి సోమవారం కొనుగోళ్లు జరుగుతాయని రైతులు గమనించి సహకరించాలని కోరారు.