మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జన్నారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం బీహార్ కు చెందిన సింటు కుమార్ మండలంలోని మొర్రిగూడ గ్రామ శివారులోని ఒక పరిశ్రమలో వారం రోజుల క్రితం పనికి చేరాడన్నారు. మద్యం అలవాటు పడి పని చేయడం ఇష్టం లేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.