ధాన్యాన్ని పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గోరింకలపల్లి, మంగళపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. రైతులు తేమ లేకుండా లేకుండా ఉంటే తక్షణమే ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు.